Header Banner

ఓరి నాయనో! యూట్యూబ్ లో వ్యూస్ కోసం ఇలా కూడా చేస్తారా! సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపనలో..!

  Sun Mar 02, 2025 20:56        India

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే తాపత్రయంలో ఇటీవలి కాలంలో యువత విపరీత ధోరణులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే బిహార్‌లో జరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఆశతో ఓ యూట్యూబర్ రైల్వే స్టేషన్‌లో అరాచకంగా వ్యవహరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయ్యింది. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. యూట్యూబర్‌ను అరెస్ట్ చేశారు. వ్యూస్, లైకుల కోసం ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి ప్రెస్ మీట్! చంద్రబాబు సూచన మేరకే నడుచుకుంటున్నా!

 

సోషల్ మీడియా పైత్యం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే తాపత్రయంలో.. ఇష్టానుసారం ప్రవర్తిస్తూ చిక్కుల్లో పడుతున్నారు కొంతమంది యువత. అలాంటి ఘటనే బిహార్‌లో చోటుచేసుకుంది. బిహార్‌లోని అనుగ్రహ నారాయణ రోడ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరగ్గా.. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది, దీంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే యావతో.. విచక్షణ మరిచి వ్యవహరించిన ఆ యూట్యూబర్‌కు బుద్ధి చెప్పారు. అలాగే ఈ ఘటనను రైల్వే పోలీసులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. లైకులు, షేర్ల కోసం రైల్వే ప్రయాణికుల భద్రత విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 


సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరికతో ఓ యూట్యూబర్.. రైల్వే ప్రయాణికుడిపై దాడి చేశాడు. రైలు వెళ్తున్న సమయంలో ప్లా్ట్ ఫారమ్‌ మీద నిలుచున్న ఆ యువకుడు.. కిటికీ పక్కన కూర్చున్న ఓ రైలు ప్రయాణికుణ్ని గట్టిగా చెంప దెబ్బ కొట్టాడు. ఈ తతంగాన్ని ఆ యువకుడి స్నేహితుడు.. వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ నెటిజనం మండిపడ్డారు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ కాదని.. హెరాస్‌మెంట్ అంటూ నెటిజనం మండిపడ్డారు.

 

ఇక ఈ వైరల్ వీడియో రైల్వే పోలీసుల వరకూ చేరటంతో.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు. వైరల్ వీడియోలోని యువకుణ్ని గుర్తించారు. ఆ యువకుణ్ని రితేష్ కుమార్ అనే యూట్యూబర్‌గా గుర్తించిన ఆర్పీఎఫ్ పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రైలు ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో ఎలాంటి రాజీపడేది లేదంటూ ఆర్పీఎఫ్ పోలీసులు స్పష్టం చేశారు. రైలు ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఇలాంటి పనులను అసలు సహించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ కేసులో నిందితుడైన రితేష్ కుమార్ సైతం.. బహిరంగ క్షమాపణ తెలియజేశాడు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ViralVideo #YouTuberArrested #SocialMediaMadness #RailwaySafety #BiharNews #RPFAction #ShockingIncident #ViewsGoneWrong #OnlineInfluence #ThinkBeforeYouAct